రాజ‌మౌళి-దాన‌య్య మ‌ధ్య విభేదాలు.. ఈ క్లారిటీ స‌రిపోతుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం గ‌త ఏడాది విడుద‌లై ఎన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌క్క‌ర్లేదు. విడుద‌లైన అన్ని చోట్ల కాసుల వ‌ర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తాజాగా భార‌తీయులంద‌రూ గ‌ర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవ‌శం చేసుకుని చ‌రిత్ర సృష్టించింది.

అయితే గోల్డేన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో గానీ, హాలీవడ్ క్రిటిక్స్ అవార్డ్ ఫంక్షన్‌లోగానీ.. ఇతర హాలీవుడ్ స్రీనింగ్స్‌లో ఎక్కడా కూడా నిర్మాత దాన‌య్య కనిపించలేదు. అస‌లు ఎవ‌రూ ఆయ‌న పేరు కూడా ఎత్త‌లేదు. దీంతో రాజ‌మౌళి, దాన‌య్య మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయ‌ని.. అంద‌రూ ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం ఆయ‌న్ను దూరం పెట్టింద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్‌ నామినేషన్స్‌ లో ఉంచేందుకు అమెరికాలో రాజ‌మౌళి భారీ ఎత్తున‌ క్యాంపెయిన్ చేసేందుకు. కానీ, అందుకు దాన‌య్య ఏ మాత్రం స‌హాయం చేయ‌లేద‌ట‌. మొత్తం ఖ‌ర్చునే రాజ‌మౌళినే పెట్టుకున్నార‌ట‌. ఈ కార‌ణంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య చెడింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌వ‌ర‌కు ఈ వార్త‌ల‌పై ఎవ‌రూ నేరుగా స్పందించ‌లేదు. కానీ, `ఆర్ఆర్ఆర్`కు ఆస్కార్ రాగానే నిర్మాత దాన‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

 

 

`తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆనందంతో మాటలు రావడం లేదు. ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా వెళ్లింది అంటే అందుకు ముఖ్య కార‌ణం రాజమౌళి. ఇక ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు..ఫైల‌న్‌గా ఆస్కార్ సాధించారు` అంటూ దాన‌య్య పేర్కొన్నారు. అయితే దాన‌య్య మొత్తం క్రెడిట్ ను రాజ‌మౌళికి ఇచ్చి త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

Share post:

Latest