చిరంజీవితో పోటీపడ్డ హీరోయిన్ ఎవరో తెలుసా..?

1980లో సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది నటి యమున.. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించినప్పటికీ సడన్గా బుల్లితెర పైన ఎంట్రి ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.. ఆమె కెరియర్ లో అన్వేషిత, రక్తసంబంధం, విధి వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇప్పటికీ పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యమున తన సినీ ప్రయాణం గురించి తెలియజేసింది.

She Missed Balayya, Chiru Romance | cinejosh.com
వాస్తవానికి యమున అసలు పేరు ప్రేమ.. కానీ ఆమెకు డైరెక్టర్ బాలచందర్ యమున అని పేరు మార్చడం జరిగిందట. తాను ఫస్ట్ సినిమానే బాలచందర్ గారితో చేశాను ఇండస్ట్రీకి వచ్చి 34 సంవత్సరాలు అవుతోంది 1989లో అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను చేసినవి తక్కువ సినిమాలైన మంచి సినిమాలు చేశారని ఫీలింగ్ కలిగింది.. తన కెరియర్ లో మామగారు, మౌన పోరాటం ,ఎర్రమందారం, పుట్టింటి పట్టుచీర ఇలా ఎన్నో సినిమాలలో చేశాను.. పుట్టింటి పట్టుచీర సినిమాని అప్పట్లో చిరంజీవి చిత్రానికి పోటీగా నిలచింది అని తెలిపింది యమునా.

సినిమాలలో మంచి పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఈమె బుల్లితెర పైన వచ్చేసింది.. ఇది ఎలా అనే ప్రశ్న అడగగా అందుకు సమానంగా.. తన తల్లి సపోర్టు దేవుడి దయవల్లి ఇలా సాధ్యమైంది నేను ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చిన మౌన పోరాటం సినిమాతో యాక్టింగ్ నేర్చుకున్న.. ఈ టీవీతో అప్పటినుంచి చాలా బాండింగ్ ఉంది.. అందుకే వారి బ్యానర్ లోని విధి అన్వేషిత వంటి సీరియల్స్ లో నటించాలని తెలిపింది. ఇక తన తల్లి తనకు పెళ్లి చేయాలనుకోవడంతో చెన్నై నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యామని అలా ఈటీవీ సుమన్ గారి ఈ విషయం తెలియక తనని వెతుక్కోని మరి అన్వేషిత సీరియల్ చేద్దామని చెప్పారట. అప్పటినుంచి ఇప్పటివరకు నటిస్తూనే ఉన్నారని తెలిపింది యమున..