హీరోయిన్ లయ అమెరికాలో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

తెలుగు అందం హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఈ మూడు చిత్రాలకు గానూ వరుసగా మూడు మంది అవార్డులను అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటూ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు దూరం అయింది.

Actress Laya ups her PR game to make a comeback in Tollywood

ప్రస్తుతం భర్త పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తరచూ రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలోని ఇటీవల ఇండియాకు వచ్చిన లయ వరుసగా ఇంటర్వ్యూలు చేసింది. ఈ సందర్భంగా అమెరికాలో తాను చేసే జాబ్ శాలరీ గురించి పల ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇకపోతే 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన తర్వాత 2011 నుంచి ఐటీ సెక్టర్ లో జాబ్ చేసినట్లు తెలిపింది. నాలుగేళ్లు ఫుల్ టైం వర్క్ చేశానని.. ఇండియాలో ప్రముఖ సంస్థకు చేసినట్లు ఆమె తెలిపింది.

అయితే తన శాలరీ అన్ని టాక్స్లు పోనూ నెలకు 12,000 డాలర్లు అని చెప్పింది అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు నెలకు రూ.9,60,000. నాలుగేళ్లు ఐటి సెక్టార్ లో చేసిన ఈమె 2017లో జాబు వదిలేసానని ఆ తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను.. అది కూడా కోవిడ్ కారణంగా మూసేశాను అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టాను. ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాద్ చాలా బాగుందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest