హీరోయిన్ తాప్సి పై పోలీస్ కేసు.. కారణం..?

గతంలో ఎంతోమంది నటీనటులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని వారు దుస్తుల ఎంపిక నడవడిక మంచితనంగా లేదని ఫిర్యాదులు చేయడం జరిగింది. కొంతమంది మత గురువుల నుంచి రాజకీయ నాయకులు నుంచి సినీ తారలను హెచ్చరించిన సందర్భాలు మనం చూసే ఉన్నాము. గతంలో అమీర్ ఖాన్, కమలహాసన్ రణవీర్ సింగ్ నగ్న ఫోటోలు సైతం పలు ప్రకంపనలు సృష్టించాయి.. అలాగే నేహా దుఫియా, లారా దత్త గంగాన ఇలా ఎంతోమంది హీరోయిన్స్ బోల్డ్ గా అందాలను ఆరబోసి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు.

ఈసారి అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటోంది హీరోయిన్ తాప్సీ పన్ను.. ముంబై లాక్ మై ఇండియా ఫ్యాషన్ వీక్ లో తాప్సి టూమచ్ బోల్డ్ లుక్ లో అందరిని ఆశ్చర్యపరిచింది.. ఈ ఫోటోలపై హిందూ రక్షక్ సంఘటన్ సభ్యుడు బిజెపి ఎమ్మెల్యే మాలిని గౌడ్ కుమారుడు ఏకలవ్య సింగ్ తాప్సి పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తాప్సి మెడలో భారీ లాకెట్ లక్ష్మీదేవి విగ్రహంతో ఆలయాన్ని తలపించే విధంగా ఆభరణాలు ధరించి ఘాటుగా అందాల ఆరబోజిత ప్రదర్శించిందని అందులో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై ఒక పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. మతపరమైన మనోభావాలు భారతీయ సనాతన ధర్మ ప్రతిష్టను దెబ్బతీసినందుకు తాప్సీ పన్ను పైన ఏకలవ్య నుండి మాకు ఫిర్యాదు అందిందని తెలిపారు. మార్చి 12న ముంబై లాక్మే ఫ్యాషన్ లో ర్యాంపు వాక్ లో ఇలా టూమచ్ రివిలింగ్ డ్రస్సులో లక్ష్మీదేవి ఉన్న లాకెట్ ధరించడం పై ఫిర్యాదు అందింది ప్రస్తుతం విచారణ సాగుతోంది అంటూ తెలిపారు.

తాప్సి వేసుకున్న ఎరుపు రంగులో లక్ష్మీదేవి విగ్రహం పై రూపొందించిన లాకెట్ అలంకరణతో ర్యాంపు పై నడిచింది. అయితే తాప్సి వేసుకున్న నెక్లెస్ ఎంచుకున్న గౌను చాలా బోర్డ్ గా ఉన్నాయని ముఖ్యంగా ఎద అందాలు థైస్ అందాలను చూపిస్తూ లక్ష్మీ విగ్రహాన్ని కలిగి ఉన్న నెక్లెస్ ధరించడం సరికాదని సింగ్ ఆరోపించారు. మరి ఈ విషయం ఎంత దాకా వెళుతుందో చూడాలి మరి.

Share post:

Latest