ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలేయడానికి కారణం వారేనా..?

బాలీవుడ్ లోని రాజకీయాల పైన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రకటనపై కంగన రనౌత్ తాజాగా స్పందించడం జరిగింది. కరణ్ జోహార్ అసహ్యకరమైన విషపూరితమైన వ్యక్తి అని కంగన రనౌత్ తెలియజేయడం జరిగింది. అతడి రాజకీయాల వల్లే ప్రియాంక చోప్రా దేశం విడిచి వెళ్లిపోయిందని ఫైర్ అవడం జరిగింది. త్వరలో సీటడెల్ లో కనిపించనున్న ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది.

kangana ranaut: After Priyanka Chopra says she was sidelined by Bollywood,  Kangana Ranaut calls out Karan Johar for orchestrating 'Quantico' star's  B'town exit - The Economic Times
ముఖ్యంగా బాలీవుడ్లో రాజకీయాలతో విసిగిపోయానని ఈమె ఈ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పేసింది. బాలీవుడ్లో తాను చేయాలనుకున్న పలు ప్రాజెక్టులలో నటించలేకపోయాను అని తెలిపింది. ఇక్కడ అవకాశాలు పొందడం అంటే కొన్ని సమూహాలతో స్నేహం చేయడమేనని.. వారిలాగా గేమ్ ఆడడంలో తనకు నైపుణ్యం లేదని ప్రియాంక చోప్రా తెలిపింది.. తన మ్యూజిక్ వీడియో తర్వాత తాను విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ప్రియాంక చోప్రా తెలిపింది.. ముఖ్యంగా బాలీవుడ్లో చాలా కాలం పని చేశాను కొత్త పచ్చిక బయలు అన్వేషించడానికి వెనుకాడనని తెలిపింది. ఇక వీరి వ్యాఖ్యలకు కంగన రనౌత్ ఘాటుగా స్పందించింది.

Priyanka Chopra Says She Froze Her Eggs

కరణ్ జోహార్ మాఫియాల షో మొత్తం నడుపుతున్నాడని ప్రతిభావంతులైన బయట వ్యక్తులకు అవకాశాలు రావడంలేదని కంగన మరొకసారి ఫైర్ అవుతోంది.కంగన ఈ విషయంపై వరుస ట్వీట్లతో కరణ్ అండ్ మాఫియా పై చెలరేగారు.. వాస్తవానికి ప్రియాంక చోప్రా తన ఇంటర్వ్యూలో ఎవరి పేరును ప్రస్తావించలేదు.. కానీ కంగన మాత్రం నూటికి నూరు శాతం కరుణ్ జోహార్ పేరుని ప్రస్తావించింది..

బాలీవుడ్ గురించి చెప్పాలి అంటే.. ప్రియాంక చోప్రా పై అందరూ కలిసికట్టుగానే బెదిరించారు. ఆమెను సినిమా పరిశ్రమ నుంచి తరిమికొట్టారు ఒక స్వయం నిర్మిత మహిళ భారతదేశం వదిలి వెళ్లేలా చేసింది ఈ గ్యాంగ్ కరణ్ జోహార్ బృందం అంటూ తెలియజేసింది.. షారుక్ తో ప్రియాంక స్నేహం అప్పటికే ఆమె కరణ్ జోహార్ తో విభేదం గురించి మీడియా విస్తృతంగా రాసింది. కరణ్ జోహార్ గ్యాంగ్ మొత్తం తనని భారతదేశం వదిలి వెళ్ళేంతవరకు వేధించింది అంటూ తెలుపుతోంది.

Share post:

Latest