ఆది పురష్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది ఆది పురష్ చిత్రం. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా కృతి సనన్ నటిస్తున్నది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న గ్రాఫిక్స్ పరంగా విమర్శలు పొందింది.దీంతో డైరెక్టర్ ఓం రౌత్ రీ గ్రాఫిక్స్ చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం వాటి గురించి తెలుసుకుందాం.

Adipurush teaser: Prabhas' Lord Ram gets ready to battle Saif Ali Khan's  Lankesh in a jerky CGI fest | Entertainment News,The Indian Express
గత ఏడాది విడుదలైన టీజర్ తో అందరికీ షాక్ ఇచ్చింది అది పురుష్ చిత్రం బృందం. దీంతో డైరెక్టర్ ఈ సినిమా కోసం మరొక రూ .100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గ్రాఫిక్స్ మళ్లీ రీ డిజైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆది పురుష్ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలుగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన చిత్ర బృందం తమ సినిమా అని సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన విడుదల చేయాలని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ..తాజాగా ఈ సినిమా గురించి ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడుతున్నారు. కానీ శ్రీరామనవమి సందర్భంగా వరుస అప్డేట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మార్చి 30 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం దీంతో అభిమానులు కాస్త ఖుషి గా ఫీల్ అవుతున్నారు.

Share post:

Latest