ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన నాని.. కానీ, ఓ కోరిక మాత్రం తీర‌లేదట‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే నాని బ్యాక్ టు బ్యాక్ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నాని.. అతిలోక సుంద‌రి, దివంగ‌త న‌టి శ్రీ‌దేవిని పిచ్చిగా ప్రేమించాన‌ని, ఆమెకు వీరాభిమాని అని త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

`నా జీవితంపై శ్రీ‌దేవి ప్ర‌భావం ఎంత‌గానో ప‌డింది. ఎందుకంటే, నా డ్రీమ్ డేట్ శ్రీ‌దేవితోనే. కానీ, ఆ కోరిక తీర‌లేదు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆమె ఆ రోజు మ‌న మ‌ధ్య లేరు. అయిన‌ప్ప‌టికీ కూడా ఆమెకు నేను పెద్ద అభిమానిని. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ క్ష‌ణక్ష‌ణం సినిమాలో ఆమెను చూస్తుంటే ఇప్ప‌టికీ నాకు క‌ల‌గానే అనిపిస్తుంది` అని నాని చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

Share post:

Latest