“ఆడు ఓ నీచ్ కమీన్ కుత్తే” .. హీరో యాష్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ఓ మై గాడ్.. ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీలోనే ఓ సంచలనం అని చెప్పాలి . ఇప్పటివరకు ఎవరు ఏ స్టార్ హీరో పై డైరెక్టర్స్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉండరు. కానీ ఫస్ట్ టైం కేరాఫ్ కంచలపాలెం సినిమా డైరెక్టర్… వెంకటేష్ మహా పాన్ ఇండియా లెవెల్లో.. క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో యాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ అవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ లిస్టులోకి యాడ్ అయిపోయారు వెంకటేష్ మహా.

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ మహా .. ఊరు పేరు చెప్పకుండానే పరోక్షకంగా అర్థం వచ్చేలా పాన్ ఇండియా హీరో యాష్ ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై సంచలన కామెంట్స్ చేశారు , ఈ క్రమంలోనే ఆ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా మాట్లాడుతూ ..”నేను సినిమా పేరు చెప్పదలుచుకోవట్లేదు .. ఈ మధ్యకాలంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. జనాలు ఓ అంటూ ఎగబడి చూసేసారు ..అసలు ఆ సినిమాలో కథ ఉందా..? అని నాకు డౌట్ వస్తుంది . సినిమాలో హీరో తల్లి హీరోని ఓ కోరిక కోరుతుంది . ఈ క్రమంలోనే హీరో ..తల్లి కోరికను తీర్చడానికి సిద్ధమవుతాడు . నువ్వు బాగా బంగారం సంపాదించి ధనవంతుడు కావాలి అని కోరుకున్న ఆ తల్లి కోరికను తీర్చడానికి హీరో నానాదంటాలు పడతారు.

సిన్ కట్ చేస్తే చివర్లో బంగారం మొత్తం తీసుకెళ్లిపోతాడు . వాడే ఓ కుతే గాడు.. వాడి చుట్టు కొన్ని వేల మంది ఉంటారు . అయినా వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడో పారదొబ్బుతాడు. అసలు ఇది కథ అంటారా ..? ఓ హీరో ఇలాంటి పని చేస్తాడా..? వాడు నిజంగా ఓ నీచ్ కమీన్ కుత్తే..? ఇది ఓ గొప్ప కథ. అలాంటి సినిమాని జనాలు ఎగబడి చూసేసారు “అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోనే డైరెక్టర్ మహా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఇంటర్వ్యూలో వెంకటేష్ మాహా తో పాటు డైరెక్టర్ శివనిర్వాణ నందిని రెడ్డి ..ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఉన్నారు. వెంకటేష్ మహా మాట్లాడుతుంటే వాళ్లంతా పగలబడి నవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

Share post:

Latest