`దసరా` సెన్సార్ రివ్యూ.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వ‌హించాడు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌స‌రా ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది. ఇక‌పోతే తాజాగా ఈ మూవీ సెన్సార్ కు వెళ్లింది. ద‌స‌రాను వీక్షించిన సెన్సార్ స‌భ్య‌ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

ఈ సినిమా చాలా బాగుంద‌ని, ముఖ్యంగా నాని-కీర్తి సురేష్ ల న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింద‌ని చెప్పార‌ట‌. ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఆంశాలు అన్నీ ఇందులో ఉన్నాయ‌ట‌. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యిందంటున్నారు. విలేజ్ పాలిటిక్స్, వర్గ పోరాటాల నడుమ ప్యూర్ లవ్ స్టోరీని చ‌క్క‌గా చెప్పార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. మొత్తానికి ద‌స‌రా సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని సెన్సార్ స‌భ్యులు న‌మ్మ‌కం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ద‌స‌రాను నాని జాత‌కం మార‌డం ఖాయ‌మ‌వుతుంది.

Share post:

Latest