మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఆయన ఒక పోస్ట్ చేయగా ఇప్పుడు సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా వీరు విడాకులు ప్రకటించకపోయినప్పటికీ కూడా విడిపోయారన్నమాట వాస్తవమేనని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ వాదన బలపరిచే విధంగా పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్ కలసి కనిపించి దాదాపు ఏడాది దాటిపోయింది. వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్లు విడాకుల మేటర్ ను ధ్రువీకరిస్తున్నాయి.
కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్క శ్రీజా వద్దే పెరుగుతోంది. ఈ క్రమంలోనే కూతుర్ని తలుచుకొని కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ పెడుతూ ఉంటారు.అంతేకాదు ఆ పాపను బాగా మిస్ అవుతున్న భావనను ఆయన వ్యక్తికరిస్తూ ఉంటారు. కానీ తాజాగా హోలీ పండుగ వేళ కళ్యాణ్ దేవ్ చాలా ఫుల్ ఖుషి లో ఉన్నట్లు కనిపించారు. హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కళ్యాణ్ దేవ్ ఆల్ ఈజ్ వెల్ అన్న వాదన వినిపిస్తోంది.ఆయన విడాకుల డిప్రెషన్ నుండి బయటకు వచ్చారని అందుకే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు అని పరిశ్రమల వర్గాల అంచనా. అంతేకాదు ఇంత త్వరగా ఆయన డిప్రెషన్ నుంచి కోల్పోవడం చూసి మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.
ఒకరకంగా చెప్పాలి అంటే ఇది ఇద్దరికీ మంచిదే.. అయితే ఇటీవల శ్రీజ , కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు. వాలెంటైన్స్ డే నాడు వారి సోషల్ మీడియా పోస్ట్లు అతిపెద్ద చర్చకు దారి తీసాయి. కళ్యాణ్ ..” ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు.. ఎలా ట్రీట్ చేసాం అన్నది ముఖ్యం..” అని ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పోస్ట్ చేయగా.. దానికి కౌంటర్ గా శ్రీజ.. ఒకరిని ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు.. తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి.. ప్రేమను గుర్తించాలి.. ప్రతి చోట దానికోసం వెతకకూడదు” అని శ్రీజ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టారు.
View this post on Instagram