హాలీవుడ్ మీడియాలో ఎన్టీఆర్ కు ఘోర అవమ‌నం.. అంత మాట అన్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హాలీవుడ్ మీడియాలో ఘోర అవమానం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే రామ్ చరణ్ తాజాగా ‘టాక్ ఈజీ’ అనే పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఛానల్ లో సామ్ అనే విలేఖరి రామ్ చరణ్ తో కాసేపు చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌తో పాటు హాలీవుడ్‌ ఎంట్రీ గురించి రామ్ చ‌ర‌ణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే సదరు పాడ్‌కాస్ట్ షో హోస్ట్ ఎన్టీఆర్‌ను ఏకంగా సైడ్ యాక్టర్ అంటూ సంబోధించాడు. ఇప్పుడీ విష‌య‌మే కొత్త వివాదానికి తెర లేపింది. ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ అనడం ప‌ట్ల ఆయ‌న ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అసలే గ‌త కొద్ది రోజుల నుంచి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘటన జరగడం తో వాళ్ళిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి.

Share post:

Latest