ఆ వ్యక్తికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకంటే..

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ హీరో అయినా కూడా బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య బాబు డైలాగ్స్ తోనే సినిమాలను సూపర్ హిట్ చేస్తుంటాడు. బాలయ్య డైలాగులకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో ఇంకోవైపు రాజకీయాల్లో బాగా బిజీ అయ్యిపోయారు. అయితే ఒక ఎమ్మెల్యే కి తన డైలాగ్‌తో గట్టి వార్నింగ్ ఇచ్చాడు మన డైలాగ్స్ కింగ్ బాలయ్య.

తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యేకు తన సినిమాల్లో మాదిరి ఓ మాస్ వార్నింగ్ ఇచ్చారు బాలకృష్ణ. ‘నాతో పెట్టుకోకు నా సినిమాల జోలికొస్తే వేరేలా ఉంటుంది ‘. అంటూ సభా ముఖంగానే గర్జించారు మన నట సింహం. గుంటూరు నరసారావు పేటలో బాలయ్య అభిమానులు కొంత మంది తన పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఓ వైసీపీ ఎమ్మెల్యే బాలయ్య పాటలు విని ఆ పాటని పాడారు. ఇక ఈవిషయం తాజాగా బాలయ్య చెవిన పడింది. దాంతో తాజాగా ఆయన పాల్గొన్న ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డ్ ఈవెంట్లో వైసీపీ ఎమ్మెల్యే పై గట్టిగా రియాక్టయ్యారు బాలకృష్ణ.

“అందరూ సినిమాలు చూస్తారు. రాజకీయాలు, కులాలు, మతాలకు సంబంధం లేదు. అన్ని ప్రాంతాల వారు సినిమా చూస్తేనే అది కమర్షియల్ సక్సెస్ అవుతుంది. నటుడికి అభిమానిగా ఉండటం, రాజకీయ అనుబంధాలు రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు. వారిని ఒక్కరు కూడా కలపకూడదు’ అని బాలయ్య ఈ ఘటనపై స్పందించారు.

Share post:

Latest