“విజయ్ దేవరకొండ తో ఆ సినిమా చేసుంటే”..జనాలు బూతులు తిట్టేవారు.. స్టార్ డాటర్ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ అనగానే అందరికీ టక్కున గుర్తు వచ్చే పేరు అర్జున్ రెడ్డి. అతన్ని విజయ్ దేవరకొండ అని పిలిచే జనాలు ఎంతమంది ఉన్నారో తెలియదు ..కానీ సగానికి సగం మందికి పైగా ఫ్యాన్స్ ఆయన్ను అర్జున్ రెడ్డి అంటూనేది ర్కగ్నైజేషన్ చేస్తూ ఉంటారు . అలానే పిలుస్తూ ఉంటారు . అంతెందుకు సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు డైరెక్టర్స్ కూడా విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి గానే సంబోధిస్తూ ఉంటారు . అంతలా ఆ సినిమాతో తన లైఫ్ ను చేంజ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్టు అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఆటిట్యూడ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు .

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపించిన అమ్మాయిలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . విజయ్ దేవరకొండ ఫోటోని ఏకంగా తమ ప్రైవేట్ పార్ట్స్ పై పచ్చబొట్టు వేయించుకున్నారంటే అప్పట్లో విజయ్ దేవరకొండ మానియా ఎంతలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు . అప్పుడు ఏంటి ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ పేరు చెప్పితే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు మళ్ళినట్టు వాలిపోతూ ఉంటారు . అంతటి క్రేజ్ రావడానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా అని చెప్పక తప్పదు . అయితే రీసెంట్గా అర్జున్ రెడ్డి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్.

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని దత్ కూతురు స్వప్న దత్ మాట్లాడుతూ ..”అర్జున్ రెడ్డి మూవీ కథను ముందుగా నాకే చెప్పారు.. నేనే నిర్మించాల్సి ఉంది ..కానీ ఎందుకో స్టోరీ విదంగానే నాకు భయమేసింది ..నిర్మించడానికి ధైర్యం చాలలేదు ..కానీ ఇప్పుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అని బాధపడుతున్నాను.. అయితే ఒకటి నిజం.. ఆ టైంలో ఒకవేళ నేను సినిమాను నిర్మించి ఫ్లాప్ అయి ఉంటే మాత్రం.. ప్రజలు నన్ను తిట్టిపోసేవారు.. అమ్మాయి అయ్యుండి ఇలాంటి సినిమా నిర్మించింది ఏంటి..? అంటూ నాపై మండిపడేవారు . అయితే ఇప్పుడు ఆ నిర్ణయం తప్పు అంటూ నేను బాధపడుతున్నాను . నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ అని నాకు తెలిసింది “అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

 

Share post:

Latest