అల్లు అర్జున్ ట్వీట్ తో బయటపడ్డ విభేదాలు..!!

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి, అల్లు ఫ్యామిలీకి ఈ మధ్య పడడం లేదని వార్తలు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన ఒక ట్విట్ మరొకసారి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా నేటిజన్లో అభిప్రాయపడే విధంగా చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే. ప్రపంచ గర్వించే విధంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే..

Absence of Allu Arjun, Jr NTR at Ram Charan Love Nest

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ RRR టీంకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆస్కార్ అవార్డు రావడానికి కారణమైన రాజమౌళి ,రాహుల్ సింప్లిగంజ్, చంద్రబోస్, కీరవాణి, గ్లోబల్ స్టార్స్ మా బ్రదర్స్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లకు నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. మీరు మీ డాన్స్ తో ఉర్రూతలు ఊగించారు తెలుగువారిని చాలా గర్వపడేలా చేశారు తారకుకి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అంటూ తెలియజేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తన ట్విట్టర్ లోనుంచి రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పినప్పటికీ ఎన్టీఆర్కు మాత్రం స్పెషల్ గా విష్ చేసి తెలియజేయడం జరిగింది.

ఎన్టీఆర్ కి స్పెషల్గా విష్ చేయడంతో అటు ఆల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు మరొక సారి వైరల్ గా మారుతున్నాయి. అందుకే అల్లు అర్జున్ రామ్ చరణ్ కు స్పెషల్గా విష్ చేయలేదంటూ కూడా పలువురు నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా వైరల్ గా మారుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

Share post:

Latest