సమంత ఇంత తింగిరిదా..? ఈ టైంలో అలాంటి పనులు అవసరమా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది . కాగా ఏం మాయ చేసావే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన సమంత.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న సమంత .. రీసెంట్ గానే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైంది .

 

కాగా ఎట్టకేలకు ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుని సేఫ్ జోన్ లో బయటపడ్డ సమంత..ఒకప్పుడు ఎంత కమర్షియల్ గా ఎంత గ్లామరస్ గా సినిమాలను సెలెక్ట్ చేసుకుందో.. ఇప్పుడు అంతే నెగటివ్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటూ వస్తుంది. దీంతో సమంత వద్దకు వచ్చిన భారీ భారీ ఆఫర్లను రిజెక్ట్ చేస్తుందట . ఇప్పటికే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన సమంత.. రీసెంట్ గా ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాదు సమంత బాలీవుడ్ లో కూడా రెండు ప్రతిష్టాత్మకమైన సినిమాలను గ్లామరస్ పాత్రలు కారణంగా రిజెక్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు టాలెంటెడ్ అనుకున్న సమంత ఇంత తింగిరిదా అంటూ జనాలు వెటకారంగా కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు నీ పొజిషన్ బాగో లేనప్పుడు వచ్చిన రోల్స్ చేయాలి కానీ కండిషన్స్ పెట్టుకుంటే కుదరదు బేబీ అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు..!!

Share post:

Latest