అదే నిజమైతే..రష్మి అభిమానులకు పండగ.. కుర్రాళ్లకి దండగా..!!

జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని ఎంట్రీ ఇచ్చి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో బులితెరపై కూడా యాంకర్ గా మెరిసింది . ప్రజెంట్ వెండితెరపై బ్యూటీగా కన్నా బుల్లితెరపై బ్యూటీగానే అమ్ముడు పేరు సంపాదించుకుంది . వెండితెరపై రష్మీ కనిపిస్తే చూసేది తక్కువ జనాలే.. అదే అందాలను బుల్లితెరపై ఎక్స్ పోజ్ చేస్తే మాత్రం హ్యూజ్ రేంజ్ లో ఎగబడి ఎగబడి జనాలు చూస్తూ ఉంటారు . రష్మి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది .

ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నా ..కొత్త కొత్త యాంకర్లు పుట్టుకొస్తున్న.. రష్మికి అందరూ సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆమె అందాలే అంటూ జనాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు .కాగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసే రష్మీ గురించి రీసెంట్గా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే అభిమానులు పండగ చేసుకుంటూ ఉండగా.. మరికొందరు ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ రష్మీ అభిమానుల్ని అంతగా బాధ పెట్టిన న్యూస్ ఏంటి అనుకుంటున్నారా ..? రష్మీకి పెళ్లి చేసుకుని ఆలోచన లేదట.

ఇన్నాళ్లు రష్మీ .. సుధీర్ ని పెళ్లి చేసుకోబోతుంది అని ..మరికొందరు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎన్నెన్నో విధాలుగా ఊహించుకున్నారు. ఎన్నెన్నో వార్తలు వైరల్ అయ్యాయి . అయితే రీసెంట్గా రష్మి వాటన్నిటికీ చెక్ పెట్టేసినట్లు తెలుస్తుంది . ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ బంధు వర్గం దగ్గర తేల్చేసిందట . రీసెంట్గా రష్మికి కి తన బంధువులు మంచి సంబంధం తీసుకురావడంతో ..రష్మీ “నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు ” అంటూ మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిందట.

మనకు తెలిసిందే రష్మి తండ్రి..రష్మి మదర్ ని చీట్ చేసి వెళ్ళిపోయారు . ఆ తర్వాత రష్మి.. ఎన్నో కష్టాలు పడి ..ఇప్పుడు ఈ పొజిషన్కు వచ్చింది. అందుకే మొదటి నుంచి రష్మీకి పెళ్లి బంధం పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ..నమ్మకం లేదు. ఈ క్రమంలోనే పెళ్లి అనే పదానికి దూరంగా ఉండాలని రష్మి అనుకుంటుందట . దీంతో రష్మీ అభిమానులు కొందరు ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. మరి కొంతమంది కుర్రాళ్ళు రష్మీకి ఇంకా లైన్ వేసి దండగ అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రష్మి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

 

Share post:

Latest