బెజవాడ పాలిటిక్స్‌లో వైసీపీకి చెక్..ఆ సీట్లు డౌటే?

బెజవాడ రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది..ఇప్పటివరకు అధికార వైసీపీ హవా నడిచిన స్థానాల్లో టి‌డి‌పి బలపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా వైసీపీలో అంతర్గత పోరు పెద్ద డ్యామేజ్ చేసేలా ఉంది. బెజవాడ పార్లమెంట్ (విజయవాడ) పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లతో పాటు..నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు సీట్లు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఒక్క విజయవాడ ఈస్ట్ మినహా మిగిలిన సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీ గెలిచిన సీట్లలో సీన్ మారుతూ వస్తుంది..వైసీపీకి వ్యతిరేక పరిస్తితులు కనిపిస్తున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా పాజిటివ్ కనిపించడం లేదు. ముందు విజయవాడ పరిధిలో వైసీపీకి నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది. సెంట్రల్, వెస్ట్ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ తక్కువగా ఉంది. సెంట్రల్ లో టి‌డి‌పి లీడ్ లోకి వచ్చినట్లు కనబడుతుంది. అటు వెస్ట్ లో టి‌డి‌పి-జనసేన గాని పొత్తులో వెళితే..వైసీపీకి చెక్ పడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

ఇక మైలవరంలో గ్రూపు తగాదాలు తారస్థాయిలో ఉన్నాయి. జగన్ సర్ది చెప్పారు గాని..అయినా సరే నేతలు తగ్గేలా లేరు. అలాగే సాధారణంగానే వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది. నందిగామ, జగ్గయ్యపేట స్థానాల్లో అదే పరిస్తితి. ఈ రెండు స్థానాల్లో టి‌డి‌పి పికప్ అయింది. ఊహించని విధంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న తిరువూరులో సైతం సీన్ మారుతుంది.

గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. ఈ సారి మాత్రం వైసీపీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆ పార్టీకి షాక్ తగిలేలా ఉంది. మొత్తానికి బెజవాడ పార్లమెంట్ లో మాత్రం వైసీపీకి ఈ సారి భారీ షాక్ తప్పదు అని చెప్పవచ్చు.