హీరోలు విలన్లుగా సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో అంటే కేవలం కథానాయకుడు మాత్రమే అన్నట్లుగా పాత్రలు వస్తూ ఉండేవి. ఇప్పటికి మైన్ స్క్రిప్ట్ హీరోలంతా ఆ నియమం పాటించాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. లేకపోతే అభిమానులు మాత్రం హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది హీరోలు విషయంలో అంత ప్రభావం చూపించలేదని చెప్పవచ్చు వాళ్ళు ఎలాంటి పాత్రలు పోషించిన అభిమానులు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు అందులో కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించడం జరిగింది వారి గురించి తెలుసుకుందాం…

యంగ్ హీరో కార్తికేయ RX -100 సినిమాతో హీరోగా లాంచ్ అయ్యారు ఆ తర్వాత రెండు మూడు సినిమాల హీరోగా చేశారు ఇప్పటికీ హీరోగా పలు సినిమాలలో చేస్తున్న కార్తికేయ.. నానిస్ గ్యాంగ్ లీడర్, వాలిమై వంటి చిత్రాలలో విలన్ గా నటించారు.

ఇక మరొక హీరో అక్కినేని సుమంత్.. ఒకప్పుడు హీరోగా, మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించారు. సుమంత్ బారి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. సీతారామం చిత్రంలో విలన్ గా మెప్పించారు.

అలాగే మరొక నటుడు సత్యదేవు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కేరియర్ ను ప్రారంభించి హీరోగా పలు చిత్రాలలో నటించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ ఒక విలన్ పాత్రలో మెప్పించడం జరిగింది.

ఇక మరొక నటుడు అక్కినేని సుశాంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్నో సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో సెకండ్ హీరో పాత్రలో కూడా నటించారు అయినా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రావణాసుర చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.