బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. జీరో సినిమా తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు విరామం తీసుకుని తాజాగా వెండి తెరపై పఠాన్ చిత్రంతో సందడి చేశారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డులను బ్రేక్ చేసింది.. నిజానికి భారీ ఫాలోయింగ్ ఉన్న ఈయన నార్త్ లోనూ.. సౌత్ లోనూ అలాగే విదేశాలలో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
వాస్తవానికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా స్పెషల్ ఇమేజె సంపాదించుకున్న షారుక్ అంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్.. అందుకే అందరూ ముద్దుగా బాద్ షా అని పిలుచుకుంటారు. మొన్నటివరకు బాలీవుడ్ సినిమాకు సరైన కలెక్షన్స్ లేక వెలవెలబోయిన విషయం తెలిసిందే. అయితే షారుక్ మాత్రం పఠాన్ సినిమాతో బాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే షారుక్ ఎప్పటికప్పుడు తన సినిమా అప్ డేట్స్, వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయడంతో పాటు ట్విట్టర్ వేదికగా అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటారు..
ఇకపోతే ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు 36 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో చాలామంది షారుక్ ఖాన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. అయితే ఇన్ని మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్న షారుక్ మాత్రం కేవలం ఆరుగురికి మాత్రమే తన ఇన్ స్టా ఖాతాలో స్నానం కల్పించినట్లు తెలుస్తోంది.. అంటే కేవలం ఆరుగురిని మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు.. వారు ఎవరు అంటే ఆయన భార్య గౌరీ ఖాన్.. తనయుడు ఆర్యన్ ఖాన్ .. కూతురు సుహానా ఖాన్.. బావమరిది కూతురు ఆలియా చిబా, పర్సనల్ మేనేజర్ పూజా దద్లాని, బెస్ట్ ఫ్రెండ్ కాజల్ ఆనంద్ లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.