యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ దాదాపుగా రూ.80 కోట్లకు అటు ఇటుగా ఉన్నది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు అన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో పలు కథలు కూడా వినిపించాయి. అంతలా రాజమౌళి కొమరం భీమ్ పాత్రను తెరకెక్కించారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ కి రాబోయే రోజుల్లో ఒక్కొక్క సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటిసారి హీరోగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు.. అంతకుముందు రెండు మూడు చిత్రాలలో కూడా నటించిన రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే నిన్ను చూడాలని సినిమాకు తారక్ చాలా తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు లక్షల్లో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆది, సుబ్బు వంటి చిత్రాలకు రేమ్యనరేషన్ చాలా తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆది సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని ఎన్టీఆర్ కెరియర్నే మార్చేసింది.
ఆ తర్వాత అల్లరి రాముడు, నాగ సినిమాలకు కోటికి పైగా మొదటిసారి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే సింహాద్రి సినిమా మంచి విజయాన్ని అందుకుందో అప్పటినుంచి టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నిలిచి రెమ్యూనిరేషన్ లో కూడా అందరితో సమానంగా తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల అత్యధిక రెమ్యూనరేషన్ లో భాగంగా ఎన్టీఆర్ కూడా చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.