చిత్ర పరిశ్రమకు ఏమైంది…18 నెలల్లోనే ఇంత‌మంది హార్ట్ఎటాక్‌తో మృతిచెందారా…!

ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయసులోనే చాలామంది సెలబ్రిటీలు గుండెపోటుకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఇలా మరణించే వారిలో 40 ఏళ్ల కూడా నిండకుండానే హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు పోతున్నాయి. నిజానికి వారు అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఉంటూ …. ఒక్కసారిగా గుండెపోటు రాగానే విగ‌త‌జీవులుగా మారుతూ ఇటు వారి కుటుంబాన్ని.. అటు వారి అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు.

Types of heart attacks: Symptoms, treatment, and risks

ప్రధానంగా ఈ గుండె పోటు రావటం వల్ల‌ యువత వారి జీవితాన్ని అద్దాంతరంగా ముగిస్తున్నారు. గతంలో అధిక బరువు ఉన్నవారికి ఎక్కువ హార్ట్ ఎటాక్ వచ్చేది. ఇప్పుడు అలాంటి వ్యత్యాసం ఏమీ లేకుండా అతి చిన్న వయసులోనే ప్రతి ఒకరు గుండే పోటుకు గురవుతున్నారు. మరి ప్రధానంగా సెలబ్రిటీస్ లో కేవలం ఈ 18 నెలల్లోనే ఏకంగా ఏడు మంది అగ్ర సెలబ్రిటీలు ఇలా గుండెపోటుతో మరణించారు. అలా మరణించిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Puneeth Rajkumar death: Indian film star dies after heart attack at the gym  | The Independent

పునీత్ రాజ్ కుమార్ :
జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కన్నడ స్టార్ హీరో పునీత్‌ రాజకుమార్ గుండెపోటుతో మృతి చెందడం అభిమానులతో పాటు చిత్ర ప్ర‌రిశ్ర‌కు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. 46 సంవత్సరాల వయసులో ఆయన గుండెపోటుతో మరణించాడు. 2021 అక్టోబర్ 29వ తేదీన ఆయన మరణించడు.

Warm gentleman, bright politician': Condolences pour in for Mekapati  Goutham Reddy | The News Minute

మేకపాటి గౌతమ్‌రెడ్డి:
ఏపీలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా 49 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఫిబ్రవరి 21 2022న ఆయన మరణించడం జరిగింది. నిత్యం ఎప్పుడు వర్కౌట్ చేసే గౌతమ్ రెడ్డికి హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులను ఇటు స‌మ‌న్య ప్ర‌జ‌లు కూడా ఒక్క‌సారిగి షాక్ కి గురిచేసింది.

Bollywood - Singer KK no more, dies of a heart attack: Report - Telegraph  India

గాయకుడు కేకే:
గాయకుడు కేకే కూడా 2022 మే 31వ తేదీన 55 సంవత్సరాల వయసులో మరణించాడు. కోల్‌కొతాలోని ఒక కాలేజి ఫెస్ట్ లో పాటల ప్రదర్శన ఇస్తు అక్క‌డే హార్ట్ ఎటాక్ రావ‌డంతో మ‌ర‌ణించారు.

Sidharth Shukla And Other Bollywood Actors Who Died From Heart Attacks

సిద్ధార్థ్ శుక్లా:
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా 47 ఏళ్ల‌కే హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. బాలీవుడ్‌లో, బిగ్ బాస్ 13 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన నిద్రలోనే గుండెపోటు రావడంతో మరణించ‌రు.

TV actor Siddhaanth Surryavanshi dies at 46; experts on possible causes of  death | Health - Hindustan Times

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ..
ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత వీర్‌ సూర్యవంశీ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబైలోని హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఆయన మృతి చెందినట్లు సమాచారం అలా 46 సంవత్సరాల వయసులో 2022 నవంబర్ 11న మృతి చెందాడు.

వీరితోపాటు హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ 2022 సెప్టెంబర్ 21న గుండెపోటుతో మరణించగా.. ఇప్పుడు నందమూరి తారకరత్న కూడా 40 సంవ‌త్స‌రాల‌ వయసులోనే గుండెపోటుతో మరణించారు.

Share post:

Latest