నాగార్జునకు ఊహించ‌నంత పెద్ద షాక్ ఇచ్చిన త్రివిక్ర‌మ్‌.. త‌బ్బిఉబ్బైపోయాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడు అనే పేరు రాగానే వినపడే పేర్లు దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్.. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అగ్ర దర్శకులుగా ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులకు ఎంత క్రేజ్ ఉందంటే వారి దగ్గర ఒక కథ ఉంది అని తెలిస్తే నిర్మాతలు అది ఎలా అని కూడా అడగకుండా వారికి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు.

20 Trivikram Srinivas ideas | latest mobile, hd images, mobile wallpaper

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పుడు టాలీవుడ్ లోనే మంచి క్రేజ్ ఉంది. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. మహేష్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడం కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూశారని టాక్ కూడా నడిచింది.

Nagarjuna turns 63: Know the ageless actor's health mantra on his birthday

త్రివిక్రమ్ ముందుగా రైటర్ గా తన కెరీర్‌ను మొదలుపెట్టి కొన్ని సినిమాలుకు కథలు, డైలాగులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్ లోనే స్టార్ దర్శకుడుగా ఎదిగారు. ఆయన కెరీర్ ఆరంభంలో స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు కథలు ఇచ్చారు. ఆ సినిమాలకు ఆయన రాసిన మాటలకు అప్పుడు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తర్వాత నాగార్జున ఆయనతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు.

Manmadhudu - Disney+ Hotstar

ఆ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ కథ కూడా రాశాడు.. ఆ కథే మన్మధుడు సినిమా.. ఈ సినిమాలో డైలాగులు నాగార్జునకు చాలా బాగా నచ్చాయి. త్రివిక్రమ్ ని ఈ కథ అడిగితే ఆయన కోటి రూపాయలు డిమాండ్ చేశారట. ఆ సమయం వరకు ఏ నిర్మాత రైటర్‌కు రూ.50 లక్షల కు మించి ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా నాగార్జున షాక్ అయ్యాడు. కాని త్రివిక్రమ్ చేసిన తక్కువ సినిమాలకే మంచి ఇమేజ్ ఉండటంతో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఆ కథ చేసారు. అది సూపర్ హిట్ అయింది.

Share post:

Latest