సినీ ఇండస్ట్రిలో ఎవరైనా సరే ఒక సినీమాలో హిట్టు టాక్ తెచ్చుకున్నారంటే సినిమాలలో హీరోయిన్ కి ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుందని చెప్పవచ్చు. అగ్ర హీరో సరసన నటిస్తే ఆ హీరోయిన్ అందరికీ చేరువయ్య అవకాశం ఉంటుంది. వాస్తవానికి అలాంటి క్రేజ్ దక్కించుకుంది నటి హనీ రోజ్. రియంట్రీనే అయినప్పటికీ తనని తాను రిఫ్రెష్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రజెంటేషన్ చేసుకుంది ఈ అమ్మడు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ హనీ రోజ్ అందానికి తెలుగు ప్రేక్షకుల సైతం మంత్రముగ్ధులయ్యారు. దీంతో ఈమె క్రేజ్ భారీ గాని పెరిగిపోయింది. అంతేకాకుండా పోస్టర్లు ప్రమోషన్స్ లో కూడా హీరోయిన్స్ సైతం డామినేట్ చేసి అందంతో హడావిడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఏదిఏమైనాప్పటికీ టాలీవుడ్ లో మాత్రం హనీ రోజ్ హవా బాగా కొనసాగుతోందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో పలు షాపులు ఓపెనింగ్స్ ను రిబ్బర్ కటింగ్స్ తో హనీ రోజ్ చాలా బిజీగా ఉంటోంది. తాజాగా తెలంగాణలో ఒక నగరంలో ఒక షాపును ఓపెనింగ్ చేసేందుకు వెళ్లినప్పుడు తనతో పాటు ఉన్న మరొక హీరోయిన్ మెహ్రీన్ ని అక్కడ ఉన్న జనం అసలు పట్టించుకోకుండా కేవలం హనీ రోజ్ ను చూడగానే విజిల్స్ తో మోత మోగించే విధంగా ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
మరి కొంతమంది హనీ ప్లీజ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉన్నారు అభిమానులు.అయితే పక్కనే ఉన్న మెహరీన్ ఇదంతా చూసి తనకేమీ తెలియనట్టు వ్యవహరిస్తోంది. దీంతో హనీ రోజ్ ముందు మెహ్రిన్ తేలిపోయింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా మెహరీన్ కంటే హనీ రోజు అందమే హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram