ఫైన‌ల్ గా పట్టాలెక్కిన `వినోదయ సితం` రీమేక్.. పవన్- తేజ్ స్టైలిష్ స్టిల్స్ వైర‌ల్‌!

ఫైన‌ల్ గా త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సితం` రీమేక్ ప‌ట్టాలెక్కింది. ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, చేర్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘ఇవాళ నుండి పవన్ కళ్యాణ్ -సాయి ధరమ్ తేజ్ మూవీ పట్టాలెక్కుతుంది. త్వరలో అదిరిపోయే అప్డేట్’ ఇవ్వనున్నాం అంటూ మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు.

అలాగే ప‌వ‌న్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ స్టైలిస్ స్టిల్స్ కు పంచుకోగా.. అవి కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. కాగా, తమిళంలో తంబి రామస్వామి, సుమద్రఖని ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు తెలుగులో సుమద్రఖని పాత్ర‌లో ప‌వ‌న్‌, తంబి రామస్వా రోల్ ను తేజ్ పోషించ‌బోతున్నారు. ఇందులో ప‌వ‌న్ పాత్ర కేవ‌లం పాతిక నుంచి ముప్పై నిమిషాలు మాత్ర‌మే ఉంటుంది.

Share post:

Latest