ఐదు హిట్ సినిమాలు మిస్ చేసుకున్న రౌడీ బాయ్‌.. ద‌రిద్రం అంటే ఇదే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరైన హిట్ అందుకుని చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది లేదు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక‌పోతే విజయ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. క‌థ న‌చ్చ‌క లేదా ఇతరిత‌ర కారణాల వల్ల పలు ప్రాజెక్టులకు నో చెప్పాడు. అయితే అలా ఇటీవల కాలంలో విజయ్ మిస్ చేసుకున్న చిత్రంలో ఐదు సూపర్ హిట్స్‌ ఉన్నాయి.

ఈ లిస్టులో ఆర్ఎక్స్ 100, ఉప్పెన వంటి సినిమాలు ముందంజలో ఉన్నాయి. ఈ రెండు సినిమా కథలు మొదట విజయ్ దగ్గరికే వెళ్లాయట. కానీ ఏవో కారణాల వల్ల ఈ రెండు చిత్రాలను విజయ్‌ రిజెక్ట్ చేశాడు. ఇక ఉప్పెన మూవీతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ టాలీవుడ్ కు పరిచయమై.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే ఆర్ఎక్స్ 100 తో కార్తికేయ హిట్టు కొట్టాడు.

ఇవే కాకుండా రామ్ పోతినేని `ఇస్మార్ట్ శంకర్‌`, నితిన్ `భీష్మ`, దుల్క‌ర్ స‌ల్మాన్ `సీతారామం` కథలు కూడా ముందుగా విజయ్ దేవ‌ర‌కొండ వ‌ద్ద‌కే వచ్చాయి. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల ఆయన ఈ సినిమాలు చేయలేకపోయాడు. కట్ చేస్తే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ మిట్స్ గా నిలిచాయి. మొత్తానికి అలా విజయ్ ఐదు హిట్ సినిమాలు మిస్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు దరిద్రం అంటే ఇదే అని, ఆ ఐదు సూపర్ హిట్ సినిమాలు చేసి ఉంటే విజ‌య్ రేంజ్ మరోలా ఉండేద‌ని, టాలీవుడ్ లోనే టాప్ హీరోగా ఉండేవాడని అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest