పెళ్ళి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయ్యాడు విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జన్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోనే కోత్త ట్రేండ్‌కు తేరలేపి రౌడి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అ సినిమా తర్వాత గీత గోవిందం సినిమాతో అదిరీపోయే హిట్ అందుకున్ని స్టార్ హీరోగా మరిపోయాడు. ఇక ఆ సినిమా తర్వాత నుంచి వరుస సినిమాలు చేస్తు వస్తున్నాడు. అయితే విజయాలు మాత్రం దక్కడం లేదు.
గీత గోవిందం తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ పడలేదు. విజయ్ నటించిన గత మూడు సినిమాలపై పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాగా పూరి డైరక్షన్‌లో వచ్చిన లైగర్ భారి డిజాస్టర్ అని చెప్పాలి. లైగర్ రిజల్ట్ తో విజయ్ క్రేజ్‌ను బాగా దెబ్బతీసింది. ఆ సినిమా సక్సెస్ అయితే మత్రం ఆయన రేంజ్ మరోలా ఉండేది. పాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో చోటు దక్కేది. అయితే భారీ హైప్ మధ్య వచ్చిన లైగర్ దారుణ ఫలితం చవిచూసింది.
ఇప్పుడు ఇదే అయన అభిమానులో కూడా తీవ్ర అసహనాన్ని గురుచేస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన అభిమానులతో ఆన్లైన్ చాట్‌లో పాలుగున్నారు. అందులో అయన ఫ్యాన్స్ అడిగిన పలు విషయాలకు విజయ్ సమాధానాలు చెపుకోచ్చారు. కాగా ఓ అందులో ఓ అభిమాని విజయ్‌ను ఒక్క హిట్ ఇవ్వన్న అంటూ తనపై అసహనం బయటపెట్టాడు. ఇక విజయ్ దానికి సమధనం చేబుతు హిట్ ఒకటే పెండింగ్ రా.. హిట్ కొట్టాలి.. నెక్స్ట్ కొడదాం… అని సమాధానం చెప్పారు.
ఇక మిగిలిన వారు ఖుషి మూవీతో మనం హిట్ కొడుతున్నాం అన్న అని ఆయనకు హామీ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ ఎప్పుడు తన అభిమానులతో ఫుల్ టచ్ లో ఉంటూ వారికి సర్‌ప్రైజ్‌లు ఇస్తు ఉంటారు. ఇక ఇటీవల తన సొంత డబ్బులతో 100 మంది లక్కీ ఫ్యాన్స్ ని ఇండియాలో వారు కోరుకున్న ప్రదేశానికి ట్రిప్ కి పంపాడు. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
ప్రస్తుతం ఆయన ఖుషి సినిమా చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించారు. గతంలో మహానటి మూవీలో విజయ్-సమంత జంటగా నటించారు. ఖుషి సినిమా షూట్ చివరి దశలో ఉంది. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమాని ప్రకటించారు. కాగా గతంలో దర్శకుడు సుకుమార్ తో ఓ మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. మరీ వరుస పరాజయాల నేపథ్యంలో విజయ్ దేవరకొండకు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Me :- anna Okka hit anna @TheDeverakonda 🥳:- #VijayDeverakonda #Kushi pic.twitter.com/qj03Llfceb
— Adithya Sai Pasupula (@AdithyaSai01) February 15, 2023