అవార్డ్స్ అన్నీ రామ్ చరణ్‌కే రావాలి.. వెంకీ షాకింగ్ కామెంట్స్‌!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. అరుదైన మైలురాళ్లను అందుకుంటున్నాడు. `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా చరణ్ ఘనత సాధించారు.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్ అవార్డులపై విక్ట‌రీ వెంకటేష్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా అమెరికాలో జ‌రిగిన ఓ ఇండియ‌న్ వెడ్డింగ్ లో వెంకీ, చ‌ర‌ణ్ పాల్గొన్నాడు.

పెళ్లి వేదిక‌గాపై రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ వెంకటేష్ మాట్లాడారు. నాటు నాటు సాంగ్ లో చరణ్ పెర్ఫార్మన్స్, ఆ పాటకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు గురించి మాట్లాడారు. అందరిని గర్వించేలా చేశావు చెర్రీ అని చెబుతూనే.. అన్ని అవార్డులు నీకే అంటూ వెంకీ వ్యాఖ్యానించారు. ఆ వెంట‌నే చ‌ర‌ణ్ వెంకీకి థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఈ పెళ్లి ఎవరిదనే వివరాలు తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

Share post:

Latest