“మేడమ్ మరణించే ముందు జరిగింది ఇదే”..వాణి జయరాం పని మనిషి చెప్పిన షాకింగ్ నిజాలు..!!

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకున్న వరుస స్టార్స్ విషాదాలు వింటుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి .ప్రముఖ స్టార్స్ అయినా కృష్ణంరాజు ..సూపర్ స్టార్ కృష్ణ .. నెలల వ్యవధిలోనే మరణించడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. కాగా రెండు రోజుల క్రితమే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న కళాతపస్వి కే విశ్వనాథ్ గారు మరణించడం సినిమా ఇండస్ట్రీలోని శోకసంద్రంలోకి నింపేసింది .

ఆయన మరణ విషాదఛాయల నుండి కోలుకోక ముందే ప్రముఖ సింగర్ వాణి జయరాం మరణించారు అని వార్తలు రావడం సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. అయితే వాణిజయరాం మరణించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ ట్రె అవుతుంది. ఎటువంటి అనారోగ్యం లేని వాణీ జయరాం ఎందుకు మరణించారు..? తలకు బలమైన గాయం ఎలా తగిలింది..? ఆమె మరణించే నాలుగు గంటల ముందు ఫోన్ లిఫ్ట్ చేయలేదు .. ఎవరితో మాట్లాడలేదు అన్న విషయాలు ఆమె ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి .

ఇదే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..” నేను దాదాపు పదేళ్లుగా ఇంట్లో పని చేస్తున్నాను ..మేడం చాలా మంచివారు.. చాలా ఆప్యాయతగా పలకరిస్తారు.. మేడం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది . రీసెంట్ గా పద్మ అవార్డులు వచ్చినప్పటి నుంచి మేడం చాలా హ్యాపీగా ఉన్నారు. మేడంకి ఎక్కువ విషెస్ వచ్చాయి. చాలా హెల్తీగా ఎప్పుడెప్పుడు ఆ అవార్డు తీసుకుంటామా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు . అయితే ఇంతలోనే ఇలా జరిగింది.. నేను ఎప్పుడు వచ్చే విధంగానే ఉదయం 10:45 నిమిషాలకు ఇంటి దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాను.. మేడం డోర్ చేయలేదు మళ్ళీ కొట్టాను అయినా తీయలేదు ..ఈ టైంలోనే ఐదు ఆరుసార్లు కాలింగ్ బెల్ కొట్టి ట్రై చేశాను ..ఎంత కొట్టినా మేడం తీయట్లేదు. ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదు ..మేడం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ..నాకు చెప్పేసే వెళ్తారు..

అయితే ఎందుకు డోర్ తీయలేదు అంటూ నేను డౌట్ వచ్చి ఫోన్ చేశాను.. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయమేసింది.. వెంటనే నా భర్తకు సమాచారం ఇచ్చాను ..ఆ వెంటనే కింద ఉండే వాళ్ళకి అసలు విషయం చెప్పాను.. దీంతో అనుమానం వచ్చి వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు ..పోలీసులు వచ్చి విచారిస్తున్నారు ..మేడం నుదుటన గాయం ఎందుకయిందో నాకు అస్సలు తెలియదు.. మేడం చాలా మంచివారు ఆ మనిషి మన మధ్య లేరు అంటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది “అంటూ ఏడ్చేసారు. ఈ క్రమంలోని వాణి జయరాం భౌతికకాయాన్ని పోలీసులు ఎగ్మోర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి మరణానికి గల విషయాలను విచారిస్తున్నారు ..పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!

Share post:

Latest