టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఇంత పెద్ద క‌ష్టం వ‌చ్చిందా…. చెప్పుకోలేని బాధ వీళ్ల‌ది…!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు నటించే పెద్ద సినిమాలకు కథ‌ పెద్ద సమస్యగా మారింది. పలు ప్రాజెక్టులు కథల కోసం ఎదురుచూస్తూ అలా పెండింగ్ లో కూర్చున్నాయి. ఆ సినిమాలకు దర్శకుల‌ నుంచి పెద్ద సమస్య ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి దర్శకులు ఉన్న కథలు సెట్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయంతో తన తర్వాత సినిమా భోళా శంకర్ షూటింగ్‌ను చక చక పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సినిమాలు ఒప్పుకోవాలంటే కథలు కావాలి.. నిర్మాతలు, దర్శకులు రెడీగా ఉన్నా కానీ మంచి కథలు దొరకడం లేదు. మంచి స్టోరీ దొరికితే ఏదో ఒక దర్శకుడు చేతిలో పెట్టవచ్చు అన్న ధీమా వారిలో ఉంది. ఇప్పటికిప్పుడు మంచి కథ దొరికితే వినాయక్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాడు చిరు. ఇదే విషయాన్ని పలు మీడియా ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు.

Chiranjeevi Okayed Another Mass Script

రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. ఆయన చేతిలో నలుగురు, ఐదుగురు దర్శకులు ఉన్న ప్రస్తుతం శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నాడు. బుచ్చిబాబు కన్నా ముందే రామ్ చరణ్, నర్తన్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ కాంబోకు కథ సెట్ అవ్వకపోవడంతో నర్తన్‌ కన్నడలో ఓ చేయడానికి వెళ్ళిపోయాడు. చరణ్ ఆ ప్లేస్ లో బుచ్చి బాబుతో సినిమా కమిట్ అయ్యాడు.

Latest Update On Ram Charan-Narthan Film

మరో సీనియర్ హీరో నాగార్జునకి కూడా ఇదే సమస్య వెంటాడుతుంది. సొలోగా సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత సరైన విజయం కోసం నాగార్జున ఎదురు చూస్తూనే ఉన్నాడు. గత సంక్రాంతికి తన కొడుకు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన ది ఘోస్ట్ సినిమా నాగ్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Happy birthday Akkineni Nagarjuna: Chiranjeevi, Mahesh Babu, Dulquer  Salmaan and others wish the ace actor | Telugu Movie News - Times of India

ఆ సినిమా వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరో సినిమా కమిట్ అవలేదు. మధ్యలో ఒకటి రెండు కథలు విన్నా అవి పూర్తిస్థాయిలో సంతృప్తి పరంగా వచ్చేవరకు వెయిటింగ్ తప్పదు. ఇంకా చాలా మంది హీరోలకు ఇదే సమస్యగా వుంది. కథలు వుంటే చాలు, ఆ మాత్రం ఈ మాత్రం డైరక్టర్ తో అయినా బండి లాగించేయవచ్చు అనే ఆలోచనలో వున్నారు కొంతమంది. మొత్తం మీద టాలీవుడ్‌లో కథ ఎంతో కీలకంగా మారింది.