బాలకృష్ణ – అనుష్క కాంబోలో మిస్సయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100వ‌ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వ‌చ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన 100వ‌ సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి… ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ‌ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేయాలని బాలయ్య అనుకున్నారు.

Senior actor to play the villain opposite Balayya - JSWTV.TV

ఆ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ డేట్లు ఇవ్వలేకపోయారు. దీంతో చివరకు క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణికే బాలయ్య ఓటేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన 17వ శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మరో విశేషం ఏంటంటే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కు పోటీగా రిలీజ్ అయ్యి మరి శాతకర్ణి హిట్ అయింది.

Gautamiputra Satakarni: Balakrishna-starrer gets tax relief in AP,  Telangana | Entertainment News,The Indian Express

ఆ సంక్రాంతికి మ‌రో యువ హీరో శర్వానంద్ శతమానం భవతి కూడా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది,
ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మహారాణి పాత్రలో శ్రియ నటించిన బాలయ్య శ్రియ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలో వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నయనతార పేరు వినిపించింది. ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో క్రిష్ ఎలాగైనా అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు.

అయ‌న‌ దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అనుష్క తన నటనతో ప్రేక్షకులను అట్టుకుంది. అందుకే ఎలాగైనా అనుష్కను ఒప్పించి బాలయ్య కి జోడిగా నటింపజేయాలని అనుకున్నారు అనుష్క కూడా బాహుబలి 2 ,సైజ్ జీరో సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది. దీంతో ఈ అవకాశం శ్రియకు దక్కింది. ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర అయినా గౌతమీ బాలశ్రీ పాత్రకు ప్రముఖ హిందీ నటి హేమమాలిని తీసుకున్నారు.

Okka Magadu (2008) - IMDb

అంతకు ముందు బాలయ్య- అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఒక్కమగాడు డిజాస్టర్ అయింది. చివరకు శాతకర్ణి లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం అనుష్క మిస్ చేసుకుంది. ఇక ఆ తర్వాత బాలయ్యతో నటించే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. మ‌రి రాబోయే రోజులో అయ‌న ఈ అవ‌కాశం వ‌స్తుందో లేదో చూడాలి.

Share post:

Latest