పెళ్లికి రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల పెళ్లి సందడి మొదలయింది. ఒకప్పటి నటి అనుష్క శెట్టి సినిమాలో కనిపించక చాలా కాలం అయింది. దాంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పటికే 41 ఏళ్ళు దాటిన అనుష్క త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి మూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయింది.

శృతి హాసన్, శాంతను హాజారికా పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శృతి పెళ్లి పై కమల్‌ హాసన్ ఆమెకి స్వేచ్ఛని ఇచ్చాడట. ఈ విషయాన్ని కమల్ స్వయంగా శృతి తో చెప్పారట. ఇక శృతి, శాంతను లీవింగ్ రిలేషన్ లో ఉన్నారని టాక్.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి హడావిడి చేస్తున్న రష్మిక మందన రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సల్ చేసుకుంది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండతో లవ్ ట్రాక్ నడుపుతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇటీవలే వారిద్దరూ మాల్దివ్స్ ట్రిప్ ని ఎంజాయ్ చేసి వచ్చారనే గుసగుసలు వినపడాయి. త్వరలోనే ఇరుకుటుంబాలు వారికీ నిచ్చితర్ధం చేయబోతున్నారని టాక్. అయితే రష్మిక, విజయ్ లు ఇద్దరు ఈ విషయం గురించి స్పందించడం లేదు. దాంతో అందరూ వీరి ప్రేమ, పెళ్లి నిజమే అని అంటున్నారు.

ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లి చేసుకుంది అని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై కీర్తి స్పందించలేదు కానీ ఆమె తల్లి స్పందించి కీర్తి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడే వివాహం చేసుకోదు అని చెప్పింది.

Share post:

Latest