తారకరత్న అంటే తల్లిదండ్రులకు అంత కోపమా..? కొడుకు చనిపోయినా కూడా ఆ మాట దాటని పేరంట్స్..!!

అయిపోయింది ..నందమూరి తారకరత్న తన కుటుంబాన్ని ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు . గత 23 రోజులుగా మరణంతో సుదీర్ఘ పోరాటం చేసిన నందమూరి తారకరత్న ..అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే మహాప్రస్థానంలో ముగిశాయి. అతి చిన్న వయసులోనే తారకరత్న ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పట్ల నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . మరీ ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డిని సముదాయించడం ఎవరి తరం కావడం లేదు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న ఆమె ఇక నా భర్త లేడు అని తెలుసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది .

విగత జీవిగా పడి ఉన్న తారకరత్న పార్థివ దేహం వద్ద ఆమె విలపిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్క మనిషికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి . కాగా తారకరత్న అంత్యక్రియలను మహాప్రస్థానంలో పూర్తిచేసిన కుటుంబ సభ్యులు తారకరత్నకు కన్నీటి వీడ్కోలు అందించారు. కాగా ఇదే క్రమంలో తారకరత్న తల్లిదండ్రుల గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి తారకరత్న అంటే ఆయన తండ్రి మోహన్ కృష్ణకు.. తల్లి శాంతి కి చాలా ఇష్టమట. అయితే చిన్నప్పటినుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు అన్న కారణంతోనే నందమూరి కుటుంబం ఆయనను వెలివేసింది.

ఈ క్రమంలోని మోహన్ కృష్ణ – శాంతి ఆయన పెళ్లి చేసుకున్న అప్పటినుంచి చనిపోయే వరకు ఆయన ముఖమే చూడలేదట. ఏ ఫంక్షన్ లో కలవలేదు.. మాట్లాడలేదు. మనవడు పుట్టిన.. మనవరాలు పుట్టిన వాళ్ల ముఖం కూడా చూడలేదు అంటూ సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆఖరికి తారకరత్న హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కానీ ఆయన ని చూడడానికి తన తండ్రి – తల్లి రాకపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది .

అంత ఎందుకు చనిపోయిన తారకరత్న ఇంటి వద్దకు తీసుకెళ్లిన సరే ..ఆయన గడప తొక్కే ప్రసక్తే లేదంటూ తగేసి చెప్పిన మోహన్ కృష్ణ.. ఆ మాటకు నిలబడి కట్టుబడి కొడుకు చనిపోయిన గడప తొక్క లేదు . మహాప్రస్థానంలో ఆయన అంతిక్రియలకు మాత్రమే మోహన్ కృష్ణ- శాంతి హాజరయ్యారు. కాగా కడసారి చివరికి చూపు చూసుకున్న కొడుకును తల్లి శాంతి దేవి ఏడ్చిన దృశ్యాలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుండెలు బాదుకొని నా కొడుకు ఇక లేడు అని మాట్లాడిన మాటలు అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి . కాగా స్టార్ ఫ్యామిలీలో కూడా ఇలా కులాంతర వివాహం చేసుకుంటే ఇంత పట్టింపులు పాటిస్తారా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

Share post:

Latest