సచిన్ ను కలిసిన సూర్య…అసలు రీజన్ తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు, స్టార్ క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం పెరుగుతూ వస్తుంది. గతంలో కూడా ఈ రిలేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది మరింత పెరిగింది. గతంలో బాలీవుడ్ హీరోలకు ఇండియన్ క్రికెటర్స్ కు మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత సౌత్ సినిమా నుంచి మన సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ అలాంటి స్టార్ హీరోలతో క్రికెటర్లకు మంచి అనుబంధం పెరుగుతో వచ్చింది. ఈ తరుణంలోని ఇప్పటి తరం యంగ్ హీరోలు కూడా క్రికెటర్స్ తో మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

Indian Cricketers Meet Jr NTR Ahead Of ODI Series Against New Zealand | Watch Viral Photos

రీసెంట్ గానే హైదరాబాద్ వచ్చిన ఇండియన్ టీమ్‌కు రామ్ చరణ్ తన ఇంట్లో ఆతిథ్యం కూడా ఇచ్చాడు. ఈ తరుణంలోనే భారతీయులందరూ క్రికెట్ దేవుడుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలిశారు. టీమిండియా పేరు రాగానే సచిన్ టెండుల్కర్ పేరు ఎలా గుర్తుకు వస్తుందో.. కోలీవుడ్ సినిమాలు అంటే హీరో సూర్య పేరు కూడా అలాగే గుర్తుకు వస్తుంది.

Surya Poses With Sachin Tendulkar In Mumbai, Captions It As 'Respect & Love' (View Posts) | LatestLY

అటు ఇండియన్ క్రికెట్ లవర్స్ తో పాటు.. ప్రపంచ క్రీడాభిమానులను దాదాపు 25 ఏళ్లు తన ఆటతీరుతో .. మెప్పించి క్రికెట్ దేవుడు అనిపించుకున్నాడు సచిన్ టెండుల్కర్.. అలాంటి సచిన్ తో సూర్య ఫొటో దిగేసరికి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

కానీ ఈ ఫోటోకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు. సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగారనేది మాత్రం తెలియలేదు. దీనితో ఈ బ్యూటిఫుల్ స్నాప్ సినీ వర్గాల్లో మరియు స్పోర్ట్స్ అభిమానుల్లో వెంటనే వైరల్ గా మారిపోయింది. ఇక సూర్య సినిమా ప్రస్తుతం పలు భారీ సెట్స్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Suriya Sivakumar (@actorsuriya)

Share post:

Latest