ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీ‌లీల అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తోనే కాకుండా మంచి డ్యాన్స‌ర్ గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల‌ తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది.

మరోవైపు నితిన్ తో `జూనియర్`, నవీన్ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, వైష్ణ‌వ్‌ తేజ్ తో ఓ సినిమాకు కమిట్ అయింది. చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీ‌లీల‌.. తాజాగా ఓ స్టార్ హీరో పై మోజుతో ఐటం నెంబర్ గా మారేందుకు ఒప్పుకొందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఈయ‌న ప్ర‌స్తుతం మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. సముద్రఖ‌ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇందులో పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్ కోసం మేక‌ర్స్ తాజాగా శ్రీ‌లీల‌ను సంప్రదించారట. ఇక పవన్ పై ఉన్న అభిమానంతో వెంటనే ఆమె ఐటెం సాంగ్ లో మెరిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Latest