అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ధ‌నుష్ `సార్‌`.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో!?

కోలీవుడ్‌ స్టార్ ధనుష్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగులో సార్‌, త‌మిళంలో వాతి పేర్ల‌తో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది.

విద్య అనేది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. దాన్ని అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల‌నే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఇప్ప‌టికే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే లాభాల బాట ప‌ట్టింది.

ఇదిలా ఉంటే.. సార్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. త‌మిళం, తెలుగు భాష‌ల్లో ధ‌నుష్ సినిమాల‌కు మంచి క్రేజ్, డిమాండ్ ఉండ‌టంతో భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింద‌ట‌. అయితే ఉగాది పండుగ కానుక‌గా వ‌చ్చే నెల 22న సార్ ను ఓటీటీలోకి తీసుకువ‌చ్చేందుకు నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ డేట్ ను ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌.

Share post:

Latest