తాత ఎన్టీఆర్ – తారకరత్న మరణాలకు ఉన్న ఈ కామ‌న్ లింక్ చూశారా… విధి రాత అంటే ఇదే..!

నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

తారకరత్న, అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు.. వారిలో ఒక కుమార్తె, తర్వాత కవలలు(పాప, బాబు) జన్మించారు. వారికి తారకరత్న తాత ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు.ఇక దీంతో తాత గారిపై తన ప్రేమను చాటుకున్నారు తారక రత్న.. పెద్ద పాప పేరు నిషిక (N), కోడుకు తనయ్ రామ్ (T), రెండో పాప పేరు రేయా (R).. ఇలా మూగ్గురు పేరులు క‌లిపితే NTR అనే అర్థం వచ్చేలా తమన పిల్ల‌ల‌కు పేర్లు పెట్టుకున్నారు.

Tarakaratna: తాత పేరు కలిసి వచ్చేలా.. ముగ్గురు తనయులకు ముచ్చటగా..

పిల్లలు ముగ్గురు తాత బాలయ్యతో కలిసి ఉన్న పాత ఫోటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ ఫోటో చూసి అభిమానులు, సినీ పరిశ్రమ వారు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1996 జనవరి 18న స్వర్గస్థులయ్యారు.. తారక రత్న అదే తేదీ ఫిబ్రవరి 18న శివరాత్రి నాడు కన్నుమూశారు.

అంటే తాత మరణించిన నెల రోజులకు అదే తేదీన కాలం చేశారు.. ఈ విషయం తలుచుకుంటూ నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వర్గాల వారు ఎమోషనల్ అవుతున్నారు. నిన్న తారకరత్న అంత్యక్రియలు వేలాది మంది అభిమానుల మధ్య ఎంతో ఘనంగా ముగిసాయి.

Share post:

Latest