సైలెంట్ గా సెటైరికల్ ట్విట్.. చేసిన బండ్ల గణేష్.. టార్గెట్ ఆ డైరెక్టరెనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.అయితే నిర్మాణరంగంలో బండ్ల గణేష్ సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ ఆ రంగానికి దూరమయ్యారు. దీంతో కొన్ని సినిమాలలో నటుడుగా మళ్లీ తన వంతు ప్రయత్నం చేయగా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

Bandla Ganesh: బండ్ల గణేష్ చేసిన ఆ కామెంట్స్ త్రివిక్రమ్ నీ  ఉద్దేశించినదేనా..? | NewsOrbit

ఇక తర్వాత వెంటనే జీవిత సత్యాలు బోధిస్తూ సోషల్ మీడియాలో.. పలు వేదికల పైన కొంతమంది డైరెక్టర్లు టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో పలు కామెంట్లు చేయడం జరుగుతూ వస్తోంది. మోసం చేయాలనుకునేవారు మేధావిలా నటిస్తారు వంచించాలనుకునేవాడు గురువుల నటిస్తారు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ భక్తుడు గానే పొగరుగా ఉంటారంటూ రాసుకోవచ్చారు అది మీకు నచ్చిన నచ్చకపోయినా అంటూ ట్వీట్ చేయడం జరిగింది. బట్ల గణేష్ డైరెక్టర్ త్రివిక్రమ ఉద్దేశించి ఈ ట్విట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ కి త్రివిక్రమ్ అడ్డు చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా ఆ సమయంలో బండ్ల గణేష్ కి సంబంధించి ఒక ఆడియో లీక్ అయ్యింది. దీంతో అప్పటినుంచి బండ్ల గణేష్ ,త్రివిక్రమ్ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ మధ్య ఉన్న సంబంధాలు కూడా తెగిపోయాయని ఇండస్ట్రీలో సమాచారం. ప్రస్తుతం బండ్ల గణేష్ ఎలాంటి ట్విట్ చేసిన కూడా అది త్రివిక్రమ్ ను ఉద్దేశించి చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.