ప్రభాస్‌కి షాక్.. బాహుబలి రికార్డులన్నీ చెరిపేస్తున్న ఆ సినిమా..!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకో రూ.3.5 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తే పాన్ ఇండియా మూవీ బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది. నిజానికి కరోనా తరువాత దాదాపు అన్ని ఇండస్ట్రీ లు హిట్స్ అందుకున్నాయి, ఒక్క బాలీవుడ్ తప్ప.

తెలుగులో చిత్ర పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ సాధించగా, కన్నడ నుంచి కాంతార, తమిళ్ ఇండస్ట్రీ నుంచి పొన్నియన్ సెల్వన్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాలు అన్నీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బాహుబలి 2 సినిమా తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలలో సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసాయి. అయితే అన్ని ఇండస్ట్రీ లు బాహుబలి 2 రికార్డు లు బ్రేక్ చెయ్యడానికి అతి తక్కువ సమయం తీసుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం 6 సంవత్సరాల సమయం తీసుకుంది. బాహుబలి 2 వచ్చిన ఇంతకాలనికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పఠాన్ అనేది సినిమా వచ్చి ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.

హిందీలో విడుదల అయిన బాహుబలి 2 సినిమా అత్యధిక వసూలు రాబట్టింది. గత ఆరేళ్లుగా ఏ హిందీ సినిమా కూడా ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు ను సెట్ చేయబోతున్న హిందీ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే పఠాన్ సినిమా చాలా కోట్లు వసూలు చేసింది.

Share post:

Latest