తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా సమంత ఎంట్రీచి ఇప్పటికి 13 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్టార్ హీరోయిన్గా సమంత అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఏంమాయ చేసావే సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది. తన మొదటి చిత్రంతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది సమంత.
ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఖుషి, సీటాడేల్ వంటి చిత్రాలు షూటింగ్ కూడా జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలలో నటిస్తోంది సమంత. సమంత మొదటి చిత్రం ఏంమాయ చేసావే విడుదలై 13 ఏళ్లైన సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేసింది. తనపై ఉన్న ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలుపుతోంది వాళ్లు ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఇది ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుపుతోంది.
నేను ఎంత ఎదిగినా ఎంత దూరం ప్రయాణించిన మీరంతా చూపించే ప్రేమాభిమానాలు మాత్రం తను ఎప్పటికీ మర్చిపోలేనని నాపై ఇంతగా అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తోంది. గతంలో అనేక విషయాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి కానీ ఇకపై కాదు.. కేవలం ప్రేమ కృతజ్ఞతనే కొనసాగుతున్నాయి అంటూ సమంత రాసుకొచ్చింది.. తాను నటిగా అడుగు పెట్టిన ఏ మాయ చేసావే సినిమాలోని జెస్సీ పాత్రకు సంబంధించిన పోస్టులన్నిటిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత.
View this post on Instagram