ఏ మెగా హీరోకి దక్కని భాగ్యం సాయి ధరమ్‌తేజ్‌కే దక్కింది.. అదేంటంటే??

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. పవన్ పేరు వాడుకుంటే చాలు పాపులర్ కూడా అవ్వచ్చు. పవన్ కి ఉన్న పాపులారిటీ అంతటిది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఈ తరం హీరోలతో కలిసి నటించలేదు. ఒకవేళ మెగా యంగ్ హీరోలతో కలిసి నటిస్తే ఆ యంగ్ హీరోల క్రేజ్ మరో స్థాయికి చేరిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ అరుదైన అదృష్టం తాజాగా సాయి ధరమ్ తేజ్‌కే దక్కింది. ఈ హీరో తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘వినోదయ సితం’కి తెలుగు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తన మామయ్య పవన్ నటించడం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారింది.

బుధవారం హైదరాబాద్‌లో తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘వినోదయ సితం’కి తెలుగు రీమేక్‌ షూటింగ్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ నటిస్తున్నారు. ఏ మెగా హీరోకైనా తన సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండాలనేది కల. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో సహా మెగా హీరోలు తమ సినిమాలలో పవన్ కళ్యాణ్‌ను కోరుకునేవారు, అయితే ఆ అదృష్టం సాయి ధరమ్ తేజ్‌కే దక్కడం విశేషం. మరోవైపు, ఈ చిత్రం రీమేక్ కావడం వల్ల అభిమానుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

ఓటీటీల కారణంగా ఈ రోజుల్లో ఏ చిత్ర పరిశ్రమలో రీమేక్‌ల పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఆల్రెడీ చూసేసిన సినిమాలే అని వీటిని ఎవరూ అంతగా ఆదరించడం లేదు. అయితే సాయి ధరమ్ తేజ్ ఇతర చిత్రాలతో పోల్చితే పీకే ఫ్యాక్టర్ ఒక్కటే ఈ సినిమా బిజినెస్‌ని రెట్టింపు చేస్తుంది. పవన్ కళ్యాణ్ వల్ల ఈ సినిమా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. మొత్తంమీద ఈ చిత్రం కచ్చితంగా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. అతని భవిష్యత్ ప్రాజెక్ట్‌లకు పునాది వేస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.

Share post:

Latest