మాట మార్చిన నాని…ఇదెక్కడి ట్విస్ట్ అని ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్?

ప్రముఖ నటుడు నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేచరల్ స్టార్ గా ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈగ, భలే భలే మగాడివోయ్, జెంటిల్మెన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన నాని ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తరువాత ‘దసరా ‘ అనే సినిమాను పూర్తి చేశాడు. ఇటీవలే దసరా సినిమా టీజర్ రిలీస్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా పై ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అయితే దసరా సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నానని పోయిన ఏడాది నాని అన్నారు. ఎందుకంటే దసరా సినిమా అనేది అతని కెరీర్‌లోనే చాలా కష్టతరమైన సినిమా అని, ఆ సినిమా షూటింగ్ అయిపోయేసరికి తాను పూర్తిగా అలసిపోతానని, కాబట్టి ఆ సినిమా పూర్తయ్యాక సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకుంటానని నాని అన్నారు.

కానీ ఇప్పుడు నాని మాట మార్చేశాడు. దసరా సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ అతడు ఎలాంటి లాంగ్ బ్రేకులు తీసుకోలేదు. అందుకు బదులుగా అతను నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఈరోజు మొదలు పెడుతున్నాడు. అభిమానులు దసరా సినిమాతో ఏడాదికి సరిపెట్టుకోవాలనుకుంటున్న నేపథ్యంలోనే ఈ హీరో లాంగ్ బ్రేక్ లేవీ లేవంటూ ఆడియన్స్ కి ట్విస్ట్ ఇచ్చాడు. అయితే నాని కొత్త ప్రాజెక్ట్ లో మృణాల్ ఠాకూర్ నటించనుంది. దీని బట్టి ఈ ఏడాది నాని నుంచి 2 సినిమాలు రానున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది చివరినాటికి హిట్ 3 సినిమా ని సెట్స్ పైకి తీసుకెళ్లాబోతున్నారు. ఇక త్వరలో రిలీజ్ అవ్వబోతున్న దసరా సినిమా హిట్ అయితే నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకులకు అంచనాలు పెరుగుతాయి.

Share post:

Latest