మృణాల్‌కు నెటిజ‌న్ పెళ్లి ప్ర‌పోజ‌ల్‌.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరోయిన్‌!

మృణాల్ ఠాకూర్‌.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే ఇక్క‌డ స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫ‌ర్లు అందుకుంటూ స‌త్తా చాటుతోంది.

అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ ఓ స్పెషల్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజ‌న్ ఏకంగా మృణాల్ కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టేశాడు.

`నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా సైడ్ నుంచి ఓకే` అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన మృణాల్ `నా సైడ్ నుంచి మాత్రం కాదు` అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఇక మృణాల్ తన కామెంట్ కు రిప్లై ఇవ్వడంతో స‌ద‌రు నెటిజ‌న్ ఫుల్ హాపీ అయిపోయాడు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈ అమ్మడు న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో ప‌లు సినిమాల‌కు సైన్ చేసింది.

Share post:

Latest