ఆ హీరోయిన్ గూబ గుయ్ మనిపించిన మోహన్ బాబు… ఎవ‌రా హీరోయిన్‌.. ఆ గొడ‌వ ఏంటి…?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలు అనగానే ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గుర్తుకొస్తారు. వారి తర్వాత తరం హీరోలు అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర హీరోలుగా ఎదిగారు. ఈ నలుగురే కాకుండా వారితో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. ఇక ఈయన తన కెరీర్ మొదట్లో కామెడీ విలన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత విలన్ గా ఎందరో అగ్ర హీరోల సినిమాల్లో నటించారు.

Manchu Mohan Babu and Vishnu to attend Tirupati Court today in 2019 case

ఆ తర్వాత హీరోగా మారి సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకుని కలెక్షన్ కింగ్ అనే బిరుదుని తెచ్చుకున్నాడు. మోహన్ బాబుకి హీరోగా మంచి సక్సెస్ ఉన్నప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు భయపడేవారు. ఎందుకంటే ఆయనతో సినిమాలో చేయడానికి వచ్చే డైరెక్టర్ల మీద కూడా అరిచి కోప్పడే వారట. దాంతో స్టార్ దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి వెనకడుగు వేసేవారు.

ఇక మోహన్‌బాబు తన నట వార‌సులుగా ఆయన ఇద్దరు కొడుకులు, కూతురు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా వారు మాత్రం తండ్రిలా రాణించలేకపోతున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే మోహన్ బాబు గతంలో ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నారు. అందులో ఓ వివాదం గురించి ఇప్పుడు చూద్దాం. మోహన్ బాబు త‌న‌ పెద్ద కొడుకు విష్ణు హీరోగా వచ్చిన తొలి సినిమా విష్ణులో హీరోయిన్‌గా ఆ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సాక్షి శివానంద్ సోదరి శిల్ప శివానంద్ న‌టించారు.

ఈ హీరోయిన్ విష్ణు సినిమాలో నటించే టైంలో ఈ సినిమా షూటింగ్ కి ఆలస్యంగా రావడం, సినిమాలో చిత్రీకరించే సన్నివేశాలో సరిగ్గా నటించకపోవడంతో అది చూసి విసిగిపోయిన మోహన్ బాబు అందరి ముందే శిల్పా శివానంద్‌ను చెంప చెల్లుమనిపించారట. అయితే మోహన్ బాబు ఆమె మీద చేయి చేసుకున్న విషయం మీద ఆ సమయంలో ఎంతో పెద్ద చర్చ నడిచింది. శిల్ప శివానంద్‌ను దర్శక నిర్మాతలు బ్రతిమలాడి ఈ సినిమాలో నటించేలా చేశారు. ఇది అప్ప‌ట్లో పెద్ద సెన్షేష‌న‌ల్ అయ్యింది.

Share post:

Latest