మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్.. అదిరిపోయింది గా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ,సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి వరస విజయాలు తర్వాత తన నెక్స్ట్ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకున్న సమయంలో మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది.

SSMB28: Pooja Hegde is angry with Sree Leela | cinejosh.com

మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ కూడా తాను చేసే తొలి పాన్ ఇండియా సినిమా అవటంతో ఈ సినిమాలో నటీనటుల ఎంపిక తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరొ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారంటూ తెలుస్తుంది. ఆమె పాత్ర కూడా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుందని, ఆమె పాత్ర ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరి త్రివిక్రమ్ ఈ సినిమాతో మహేష్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.

Share post:

Latest