త్రివిక్ర‌మ్ చేసిన ప‌నికి ఏకిపారేస్తున్న మ‌హేష్ ఫ్యాన్స్‌.. ఇంత అన్యాయ‌మా?

మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయ‌న్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల‌ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.

ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే త్రివిక్రమ్ మరో సినిమా పనిలో పడ్డాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేషన్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సితం` రీమేక్ ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా షూటింగ్ జరిగినన్ని రోజులు ఈ మూవీని త్రివిక్రమ్‌ పర్యవేక్షించనున్నాడు. పవన్‌-త్రివిక్రమ్ మంచి స్నేహితులు. రీఎంట్రీ త‌ర్వాత ప‌వ‌న్ సినిమాల‌ను దాదాపు త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు. గ‌త ఏడాది విడుద‌లైన `భీమ్లా నాయ‌క్‌` సినిమాకు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాసే స్క్రీన్ ప్లే, మాట‌లు అందించారు. ఇప్పుడు `వినోద‌య సితం` రీమేక్ లోనూ అదే రిపీట్ అవుతంది. దీని కార‌ణంగా మహేశ్ బాబు మూవీ షూటింగ్ మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కోసం మ‌హేష్ కు ఇంత అన్యాయం చేస్తావా అంటూ ఫ్యాన్స్ త్రివిక్ర‌మ్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Share post:

Latest