ట్విస్టులే ట్విస్టులు: మహేష్ , తారక్ లెక్కలు ఇలా రివ‌ర్స్ అయ్యాయేంటి…!

మహేష్ ను ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడో లేక ఎన్టీఆర్, మహేష్ ను ఫాలో అవుతున్నాడు తెలియదు కానీ.. ఈ ఇద్దరు హీరోల కెరీర్ టర్న్ తీసుకునే సినిమాలు మాత్రం ఈ సంవత్సరమే పట్టాలేకబోతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఓ లెక్క డిసెంబర్ నుంచి మరో లెక్క.. ఇక డిసెంబర్ నుంచి ఏం జరుగుతుందని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా వరకు మహేష్ సినీ కెరీర్ ఒకే విధంగా వెళ్ళింది.

I'm admiring Mahesh Babu and Jr NTR

కానీ ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి మాత్రం మహేష్ లైఫ్ టర్న్ తీసుకోబోతుంది. పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోతాడేమో అనిపిస్తుంది. ఇంతకీ డిసెంబర్ స్టోరీ ఏమిటంటే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించే యాక్షన్ అడ్వెంచర్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి పట్టాలెక్కుతుంది. ఇక ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దగ్గర నుంచి ఇప్పుడు కొరటాల శివ సినిమా వరకు వెండి తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలో కనిపించాడు.

Jr NTR sports fierce look in Prashanth Neel's NTR 31 - India Today

అయితే ఈ సంవత్సరం వచ్చే డిసెంబర్ నుంచి మాత్రం ఎన్టీఆర్ కూడా పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోతున్నాడు. కే జి ఎఫ్ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ సినిమాతో పూర్తిస్థాయిలో డైనమిక్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుకానుంది. ఇప్పుడు మొత్తంగా 2023 డిసెంబర్ మాత్రం ఈ ఇద్దరి హీరోల కెరీర్ లో మాత్రం ఎంతో కీలకం కాబోతుంది.

మహేష్ కంటే ముందే తారక్ నటించే యాక్షన్ ఫిలిమ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకు కారణం ప్రశాంత్ నీల్ ఫాస్ట్ మేకింగ్.. రాజమౌళి విషయం అందరికీ తెలిసిందే.. మహేష్ తో చేయబోయే సినిమాను ఎప్పటికీ కంప్లీట్ చేసి ఎప్పుడు మన ముందుకు తీసుకొస్తాడో అనేది ఆయన చేతుల్లో కూడా లేదు. మరి ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Share post:

Latest