కిస్ కావాలంటూ హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో రెచ్చిపోతున్న శ్రీజ?

హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ గురించి ఆమధ్య వినే వుంటారు. హీరోయిన్ సమంత, నటుడు నాగ చైతన్య తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన తరుణంలో సోషల్ మీడియాలో బాగా నానిన పేరు హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ అతని కారణంగానే సామ్, చే విడిపోయారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఆ వ్యాఖ్యలను ప్రీతమ్ జుకల్కర్ అధికారికంగానే ఖండించాడు. ఇక ఆ విషయం జరిగి ఒక సంవత్సరం కాకుండానే అతగాడి గురించి మరో రూమర్ వినిపించడం బాధాకరం.

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో ఓ గాసిప్ బయటకు వచ్చింది. భర్త కళ్యాణ్ దేవ్ ని శ్రీజ రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇకపోతే ఈ మధ్య కళ్యాణ్ తో కూడా శ్రీజ సరిగా ఉండటం లేదు అని గుసగుసలు బాగా వినబడుతున్న తరుణంలో ఆమెకి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కారణంగా వీరిమధ్య కూడా యవ్వారం చెడిందని వార్తలు వస్తున్నాయి.

హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఓ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మరియు డిజైనర్. ఇతడి డిజైన్లను సమంతతో పాటు రాశి ఖన్నా, స్నేహ రెడ్డి, లావణ్య త్రిపాఠి ఇలా తెలుగులో పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది నటీమణులకు అతగాడు పర్సనల్ డిజైనర్. అందులో శ్రీజ కొణిదెల ఒకరు. అయితే తాజాగా అతడు శ్రీజ తో దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా లవ్ సింబల్స్ తో పంచుకున్నాడు. దీంతో ఆ స్టోరీని శ్రీజ కొణిదెల రీస్టోరీ చేస్తూ హగ్ అండ్ కిస్ అంటూ షేర్ చేసింది. దీంతో ఆ స్టోరీ చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.