వామ్మో..ధ‌నుష్‌ కొత్త ఇల్లు అన్ని వందల కోట్లా.. స్పెషాలిటీస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మంచి జోరు మీద ఉన్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధనుష్.. ఆ గుడ్ న్యూస్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూనే..మరో తీపి కబురు అభిమానులకు అందజేశారు. రీసెంట్ గా నే ధనుష్ ఓ కొత్త ఇంటివాడు అయ్యాడు. చెన్నైలో అత్యంత ధనవంతులు ఉండే పోయెస్ట్ గార్డెన్లో కోట్లు ఖర్చు చేసి ఇల్లును కట్టుకున్నాడు. రీసెంట్గా గృహప్రవేశం చేసిన ధనుష్ ఆ ఇంటికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు .

ఈ క్రమంలోనే ధనుష్ కట్టుకున్న కొత్త ఇల్లు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసవంతంగా కోట్లు ఖర్చు చేసి ఇంటిని తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది . రెండేళ్ల క్రితమే ఇంటి నిర్మాణం పనులు చేపట్టిన పలు ఇంటీరియర్ వర్క్స్ కారణంగా గృహప్రవేశం లేటయిందట. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ దాదాపు 25 కోట్లతో ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడని ..అయితే ఇంటి నిర్మాణానికి మాత్రం కోసం ఏకంగా 270 కోట్లు ఖర్చు చేశాడని.. నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఇంట్లో ఆయనకు నచ్చిన విధంగా గార్డెన్ ఏరియా.. ఓ ప్రత్యేక జిమ్ అరేంజ్ చేసుకున్నారట. ఆయనకు నచ్చిన విధంగా ఇంట్లోని ప్రతి వాల్ ని ఇంటీరియర్ డిజైనర్ తో డెకరేట్ చేయించుకున్నారట . మరీ ముఖ్యంగా ఇంటిని వాస్తు ప్రకారం కట్టించుకున్నారట ధనుష్. దీంతో ధనుష్ కి డబుల్ కంగ్రాట్స్ చెబుతున్నారు ఫ్యాన్స్..!!

 

 

Share post:

Latest