ఆ రాత్రి నిజంగా స్పెష‌ల్‌.. వైర‌ల్ గా మారిన కియారా పోస్ట్‌!

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ గా గుర్తింపు పొందిన‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌ల పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే.ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు.

ఫిబ్ర‌వ‌రి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జ‌రిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు.

అయితే పెళ్లి వేడుక‌ల‌న్నీ పూర్తి అవ్వ‌డంతో సిద్ధార్థ్‌, కియారా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే కియారా పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను ఇన్‌స్టా ద్వారా త‌న ఫాలోవ‌ర్స్ తో పంచుకుంటోంది.

ఇటీవ‌ల హ‌ల్దీ వేడుకుల‌కు సంబంధించిన ఫోటోల‌ను పంచుకున్న కియారా.. తాజాగా సంగీత్ ఫోటోల‌ను షేర్ చేసింది. `ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. స‌మ్‌థింగ్ రియ‌ల్లీ స్పెస‌ల్‌` అంటూ ఈ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది.

అయితే సంగీత్ అని మెన్ష‌న్ చేయ‌క‌పోవ‌డంతో.. కియారా త‌న తొలి రాత్రి గురించి చెబుతుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి కియారా తాజా పోస్ట్ తెగ వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/p/Co7takyvRw-/?utm_source=ig_web_copy_link

Share post:

Latest