కన్నా సీటుపై కన్ఫ్యూజన్..ఆ మూడిటిల్లో టీడీపీకి ప్లస్సే!

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బి‌జే‌పిలో పనిచేసిన ఆయన..ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాలు నేపథ్యంలో కన్నా బి‌జే‌పిని వీడారు. అయితే కన్నా..టి‌డి‌పి లేదా జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జనసేన ఎలాగో బి‌జే‌పితో పొత్తులో ఉంది. దీని వల్ల జనసేనలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అనుచరులు సూచించారు. అలాగే టి‌డి‌పిలో చేరాలని చెప్పారు. పైగా గుంటూరులో టి‌డి‌పి బలంగా ఉంది.

ఈ నేపథ్యంలో కన్నా టి‌డి‌పిలో చేరడం ఖాయమైంది. ఈ నెల 23న కన్నా..చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పిలో చేరనున్నారు. అయితే కన్నా టి‌డి‌పిలోకి రావడం కాస్త ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే కన్నాకు గుంటూరులో కాస్త పట్టు ఉంది. పెదకూరపాడులో కన్నాకు బలం ఎక్కువ. ఇక్కడ నాలుగుసార్లు కన్నా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటు గుంటూరు వెస్ట్ లో ఒకసారి గెలిచారు. దీంతో రెండు స్థానాల్లో కన్నాకు పట్టు ఉంది..అనుచరులు ఉన్నారు. దీంతో రెండు చోట్ల టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది.

అలాగే సత్తెనపల్లిలో కూడా కన్నాకు పట్టు ఉంది. కన్నా కాపు వర్గం నేత..సత్తెనపల్లిలో కాపు వర్గం ఎక్కువ ఉంది. అలాగే అక్కడ ఆయన అనుచర గణం ఉంది. మొత్తానికి కన్నా వల్ల..మూడు స్థానాల్లో టి‌డి‌పికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే కన్నాకు ఈ మూడిటిల్లో ఏ సీటు దక్కుతుందనేది క్లారిటీ లేదు.

పెదకూరపాడులో టి‌డి‌పి నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు..దీంతో ఆ సీటు దక్కడం కష్టమే. ఇక సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ ల్లో చాలామంది నేతలు సీటు కోసం కాచుకుని కూర్చుకున్నారు. మరి ఈ రెండిటిల్లో కన్నాకు ఏ సీటు దక్కుతుందో చూడాలి.